టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా నిలిచిందని ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. లోకేశ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నెల్లూరులో ‘యువగళం–ప్రజాగళం’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరుకావడంతో నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి.
ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ.. యువత, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే లోకేశ్ ఈ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి సూచనను, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ విద్య అందించాలనే లక్ష్యంతో మంత్రిగా లోకేశ్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రప్పిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లోకేశ్ కృషి చేస్తున్నారని వేమిరెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా యువత భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బీద రవిచంద్ర మాట్లాడుతూ.. ‘యువగళం’ పాదయాత్ర ఏపీ రాజకీయాలకు గేమ్ ఛేంజర్‌గా మారిందని అభిప్రాయపడ్డారు. అలాగే 97 నియోజకవర్గాల్లో ‘యువగళం’ కొనసాగిందని, అందులో 90 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు విజయం సాధించారని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. ప్రజల్లో వచ్చిన మార్పు, నమ్మకమే ఈ విజయానికి కారణమని అన్నారు.
ఈ ర్యాలీలో టీడీపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ‘యువగళం–ప్రజాగళం’ కార్యక్రమం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రానున్న రోజుల్లో ప్రజాసేవకు కొత్త దిశ చూపుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















