భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కోచ్ అవతారమెత్తనున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆయన దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన దిల్లీ క్యాపిటల్స్, ఈసారి జట్టు ప్రదర్శనను మెరుగుపరచేందుకు కోచింగ్ బృందంలో భారీ మార్పులు చేయాలని యాజమాన్యం భావిస్తోంది.
ఈ మార్పులలో భాగంగా ప్రస్తుత కోచింగ్ సిబ్బందిలో ఉన్న వేణుగోపాల్ రావు, హేమాంగ్ బదాని, మునాఫ్ పటేల్‌లను తప్పించే అవకాశం ఉందని సమాచారం. జట్టులో కొత్త దిశను తీసుకురావడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
యువరాజ్ సింగ్ ఇప్పటికే పలువురు యువ క్రికెటర్లకు వ్యక్తిగత మెంటార్‌గా వ్యవహరించారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో ఆయన మార్గదర్శనం కీలక పాత్ర పోషించింది. ఫామ్‌లో ఇబ్బందులు ఎదురైన సమయంలో రిషబ్ పంత్ కూడా యువరాజ్ సలహాలను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, రెండు టోర్నీల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచారు. ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడిన ఆయన 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇక దిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని నియమించే అవకాశమూ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రిషబ్ పంత్ భవితవ్యంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి అతన్ని తీసుకోవడానికి దిల్లీ ఆసక్తి చూపుతోందని, ఇటీవల ఆ జట్టులో పేలవ ప్రదర్శన కారణంగా పంత్ కెప్టెన్సీ కోల్పోయిన నేపథ్యంలో అతను జట్టు మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















