విశాఖపట్నంలో పర్యాటకులను ఆకట్టుకునేలా కైలాసగిరిపై కొత్త ఆకర్షణగా రూపొందించిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ను శుక్రవారం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా కొండపై భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. తుపాన్లు, బలమైన గాలులను కూడా తట్టుకునేలా ప్రత్యేక ఇంజనీరింగ్‌తో దీన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 65 అడుగుల ఎత్తులో ఉన్న ఈ త్రిశూలం, దాని మధ్యలో ఉన్న ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా కనిపించేలా ఎత్తైన ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ప్రత్యేకంగా వెలుగులు విరజిమ్మేలా త్రిశూలం లోపల ఎస్ఈడీ లైట్లు అమర్చారు. దీంతో కైలాసగిరి మరింత ఆకర్షణీయంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణు కుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల శ్రీనివాస్, లోకం మాధవి, అలాగే వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టుతో విశాఖ పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















