అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్ చాట్‌జీపీటీ పబ్లిక్ వెర్షన్‌లో అప్‌లోడ్ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన యూఎస్ సైబర్ సెక్యూరిటీ తాత్కాలిక చీఫ్ మధు గొట్టుముక్కలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అధికారులను ఉటంకిస్తూ ‘ది పొలిటికో’ ఈ విషయాన్ని వెల్లడించింది.
గతేడాది మేలో సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మధు గొట్టుముక్కలు, ఏఐ చాట్‌బాట్ వినియోగానికి అనుమతి కోరినట్లు సమాచారం. అయితే, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన ఉద్యోగులకు చాట్‌జీపీటీ వాడకంపై నిషేధం ఉండటంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
చాట్‌జీపీటీ పబ్లిక్ వెర్షన్‌లో సీఐఎస్‌ఏకు సంబంధించిన కాంట్రాక్టు ఫైళ్లతో పాటు అత్యంత కీలక సమాచారం అప్‌లోడ్ అయిందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టులో అంతర్గత సైబర్ భద్రతా వ్యవస్థలు దీనిపై హెచ్చరికలు కూడా జారీ చేశాయని తెలుస్తోంది. ఈ ఘటనపై డీహెచ్‌ఎస్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సీఐఎస్‌ఏ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మార్సీ మెక్‌కార్తీ స్పందిస్తూ.. డీహెచ్‌ఎస్ నియంత్రణలో, పరిమిత కాలానికి మాత్రమే మధుకు చాట్‌జీపీటీ వాడేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. అయితే, పబ్లిక్ వెర్షన్‌లో అప్‌లోడ్ చేసిన సమాచారం ఓపెన్‌ఏఐకు షేర్ అవుతుందన్న అంశం ఇప్పుడు భద్రతాపరమైన ఆందోళనలకు దారి తీసింది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews




















