బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు తీవ్ర గందరగోళానికి లోనయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో అధికార కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో విపక్షానికి చెందిన ఓ ఎంపీ ప్యానెల్ స్పీకర్‌ను ఉద్దేశించి ‘యార్’ అని సంబోధించడంపై ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇప్పుడు మీరు ఏం అన్నారు? ఈ యార్ ఏంటి? ఇది పార్లమెంట్. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అలా మాట్లాడకూడదు. ఇది సభా మర్యాదకు విరుద్ధం. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోండి” అంటూ ఆయన ఎంపీని మందలించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా, చైనా దురాక్రమణ అంశంపై భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం. నరవణె ఆత్మకథలోని విషయాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. జాతీయ భద్రత అంశాలపై మాట్లాడాలనుకుంటున్నానని చెప్పిన సమయంలో విపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు చించి విసిరారు.
ఈ ఘటనపై స్పీకర్ చర్యలు తీసుకొని ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయినవారిలో హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్, కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రశాంత్ పడొలె, డీన్ కురియకోస్, సీపీఐ(ఎం) ఎంపీ ఎస్. వెంకటేశన్ ఉన్నారు.
తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















