యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate) ఛార్జీలు విధించే అంశంపై రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశమైన సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు ఎలాంటి అసమ్మతి వ్యక్తం చేయలేదంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ స్పష్టం చేశారు.
తమ కమిటీ సమావేశంలో ‘యూపీఐ ట్యాక్స్’గా కాంగ్రెస్ పేర్కొంటున్న ఎండీఆర్ ఛార్జీలపై నిర్దిష్ట ప్రతిపాదనగానీ, ప్రత్యేక చర్చగానీ జరగలేదని ఆయన తెలిపారు. ఆగస్టు 12న జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ.. ఆర్థిక శాఖ నుంచి ఎండీఆర్ విధింపుపై స్పష్టమైన ప్రతిపాదన లేదా తగిన సమాధానం రాలేదని గొగొయ్ పేర్కొన్నారు.
ఈ కమిటీలో కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగొయ్, పి. చిదంబరం, మనీశ్ తివారీ, కిశోరీ లాల్, కె. గోపీనాథ్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా సమావేశానికి హాజరైనప్పటికీ యూపీఐ ఛార్జీల అంశంపై అసమ్మతి నమోదు చేయలేదని వచ్చిన వార్తల నేపథ్యంలో గొగొయ్ వివరణ ఇచ్చారు.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించే విధానం అమల్లోకి వస్తే చిన్న వ్యాపారులు, విక్రేతలపై అదనపు భారం పడే అవకాశం ఉందని గొగొయ్ అభిప్రాయపడ్డారు. ఈ విధానం వల్ల అమెరికాకు చెందిన కంపెనీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. యూపీఐ ఛార్జీల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















