అంతర్జాతీయ టెక్ దిగ్గజం Google మాతృసంస్థ Alphabet భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కీలక అడుగులు వేస్తోంది. అమెరికాలో విదేశీ ఉద్యోగులకు వర్క్ వీసా నిబంధనలు కఠినతరం కావడంతో, అవసరమైన నైపుణ్యవంతులను భారత్‌లోనే నియమించుకునే దిశగా కొత్త కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ వెల్లడించింది.
భారత్‌లో టెక్నాలజీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో గూగుల్ భారీ క్యాంపస్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు వైట్‌ఫీల్డ్ టెక్ కారిడార్‌లోని అలెంబిక్ సిటీలో ఒక ఆఫీస్ టవర్‌ను ఆల్ఫాబెట్ లీజుకు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, మరో రెండు స్థలాలను కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం విస్తీర్ణం సుమారు 24 లక్షల చదరపు అడుగులుగా ఉంటుందని అంచనా. ఈ విస్తీర్ణాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకుంటే, సుమారు 20,000 మంది అదనపు ఉద్యోగులు ఒకే క్యాంపస్‌లో పనిచేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం భారత్‌లో ఆల్ఫాబెట్‌కు దాదాపు 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, తాజా విస్తరణతో ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఆల్ఫాబెట్‌లో మొత్తం 1.90 లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు.
భారత్‌లో టెక్ టాలెంట్ అందుబాటులో ఉండటం, మౌలిక వసతులు మెరుగ్గా ఉండటం, వ్యయపరంగా అనుకూలత వంటి అంశాలు గూగుల్‌ను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ విస్తరణతో బెంగళూరు టెక్ రంగానికి మరింత బలం చేకూరడంతో పాటు, ఐటీ ఉద్యోగావకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















