శత్రు ముప్పులను ఎదుర్కొనేందుకు ఆధునిక ఆయుధాల అభివృద్ధిపై చైనా మరింత దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో భూమి నుంచే ఉపగ్రహాలను నిర్వీర్యం చేయగల హై–పవర్ మైక్రోవేవ్ వెపన్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవస్థ ద్వారా శాటిలైట్లపై తీవ్రమైన ప్రభావం చూపే మైక్రోవేవ్ పల్స్‌లను ఉత్పత్తి చేయవచ్చని పేర్కొంటున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, చైనాలోని నార్త్‌వెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీకి చెందిన వాంగ్ గ్యాంగ్ బృందం ‘TPG1000C’ అనే అత్యాధునిక మైక్రోవేవ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సుమారు నాలుగు మీటర్ల పొడవు, ఐదు టన్నుల బరువుతో రూపొందించిన ఈ పరికరం ఒక నిమిషం పాటు నిరంతరంగా 20 గిగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉందని సమాచారం.

ఇప్పటివరకు ఉన్న హై–పవర్ మైక్రోవేవ్ వ్యవస్థలు భారీ పరిమాణంలో ఉండటంతో పాటు, కొన్ని సెకన్ల పాటు మాత్రమే శక్తిని ఉత్పత్తి చేయగలిగేవి. అయితే తాజా TPG1000C వ్యవస్థ దీర్ఘకాలం పాటు అధిక శక్తిని విడుదల చేయగలదని పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా భూదిగువ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడం లేదా పూర్తిగా నిర్వీర్యం చేయడం సాధ్యమని పేర్కొంటున్నారు.ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న స్టార్‌లింక్ శాటిలైట్లపై చైనా ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అవి దేశ భద్రతకు ముప్పుగా మారవచ్చని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘స్టార్‌లింక్ కిల్లర్’గా భావించే ఈ మైక్రోవేవ్ ఆయుధం అభివృద్ధి అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్రక్కులు, నౌకలు లేదా అంతరిక్ష వేదికల నుంచి కూడా ఈ మైక్రోవేవ్ వ్యవస్థను మోహరించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే చైనా వద్ద హరికేన్ సిరీస్ హై–పవర్ మైక్రోవేవ్ ఆయుధాలు ఉన్నప్పటికీ, అవి పరిమిత దూరంలో డ్రోన్లను మాత్రమే లక్ష్యంగా చేసుకునే విధంగా రూపొందించబడ్డాయి. తాజాగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఎదుర్కొనే సామర్థ్యం చైనాకు లభించిందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఈ ఆయుధంపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, అంతరిక్ష భద్రత రంగంలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















