అమెరికాలో పోలీసు నిర్లక్ష్యం కారణంగా తెలుగు విద్యార్థిని Jaahnavi Kandula మృతి చెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు Seattle నగర అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు.
‘‘జాహ్నవి మృతి అత్యంత విషాదకరం. ఈ సెటిల్మెంట్ ద్వారా ఆమె కుటుంబానికి కొంతైనా ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని సియాటెల్ అటార్నీ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంపై జాహ్నవి కుటుంబం తరఫున ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. పరిహార ఒప్పందానికి ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు చేసినట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (23) 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సౌత్‌లేక్ యూనియన్ ప్రాంతంలోని Northeastern Universityలో మాస్టర్స్ చదువుతున్నారు. 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాల కారణంగా జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే ప్రమాదం తర్వాత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువ లేదు’’ అనే వ్యాఖ్యలు ఆయన బాడీ కెమెరాలో రికార్డవ్వడంతో భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం 40 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న జోన్ అయినప్పటికీ, కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో బయటపడింది. ఢీకొట్టిన ప్రభావంతో జాహ్నవి సుమారు 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు అప్పట్లో నివేదికలు వెల్లడించాయి.ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై, న్యాయం కోసం జాహ్నవి కుటుంబం సాగించిన పోరాటానికి ఈ పరిహార ఒప్పందం ఒక ముఖ్యమైన మలుపుగా భావిస్తున్నారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















