పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామానికి చెందిన పోట్ల లక్ష్మీనారాయణ గారు అంధుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన తండ్రి వైద్య చికిత్స కోసం 10-02-2026న నరసరావుపేట నుంచి గుంటూరుకు కారులో వచ్చారు. గుంటూరు వారి తోట 7వ లైన్ వద్ద కారులో దిగిన అనంతరం ఆసుపత్రికి వెళ్లారు. అయితే, తొందరలో తనతో తీసుకొచ్చిన రూ.2 లక్షల నగదు సంచిని కారులోనే మర్చిపోయారు.
కొద్దిసేపటికే విషయం గుర్తించిన ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా తండ్రి చికిత్స కోసం తీసుకొచ్చిన మొత్తం కావడంతో ఆందోళన మరింత పెరిగింది. వెంటనే కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు.
సమాచారం అందుకున్న సీఐ శ్రీ వీరయ్య చౌదరి వెంటనే స్పందించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. క్రైమ్ కానిస్టేబుళ్లు జనీభాష, డేగల కోటేశ్వరరావు, చుట్ల శ్రీనివాసరావులు సంఘటనా స్థల పరిసరాల్లోని సీసీ కెమెరాలను గంటల తరబడి పరిశీలించారు. కారు నంబర్ లేదా డ్రైవర్ వివరాలు అందుబాటులో లేకపోయినా, బాధితుడు దిగిన సమయాన్ని ఆధారంగా తీసుకుని వాహనాన్ని గుర్తించడం పోలీసుల తెలివితేటలకు నిదర్శనం.డ్రైవర్‌ను సంప్రదించి నగదును స్వాధీనం చేసుకుని, ఎస్సై హనుమంతురావు చేతుల మీదుగా బాధితుడికి సురక్షితంగా అందజేశారు. నగదు తిరిగి అందడంతో ఉపాధ్యాయుడు భావోద్వేగానికి గురై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటన ప్రజలలో పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచింది. కష్టసమయంలో సహాయం చేయడమే కాకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా కొత్తపేట పోలీసులు ఆదర్శంగా నిలిచారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















