బయో ఆసియా 2026లో మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం
రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని సాంకేతికంగా మరింత బలోపేతం చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఏఐ, డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఔషధాల తయారీకి ప్రోత్సాహం అందించి, నిరుపేదలకు చౌకగా ప్రాణాధార మందులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని HITEX Exhibition Center వేదికగా రెండు రోజుల పాటు జరిగిన BioAsia 2026 23వ అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, జీవశాస్త్ర రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు‘‘ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించడం, రాష్ట్ర స్థాయి బయోబ్యాంక్ ఏర్పాటు చేయడం, గ్రామాల వరకూ ఫైబర్ కనెక్టివిటీ విస్తరించడం వంటి కీలక చర్యలు చేపడుతున్నాం. దీని వల్ల దూరప్రాంత ప్రజలు కూడా నగర వైద్యులను డిజిటల్ వేదికల ద్వారా తక్షణమే సంప్రదించగలుగుతారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించడం, రాష్ట్ర స్థాయి బయోబ్యాంక్ ఏర్పాటు చేయడం, గ్రామాల వరకూ ఫైబర్ కనెక్టివిటీ విస్తరించడం వంటి కీలక చర్యలు చేపడుతున్నాం. దీని వల్ల దూరప్రాంత ప్రజలు కూడా నగర వైద్యులను డిజిటల్ వేదికల ద్వారా తక్షణమే సంప్రదించగలుగుతారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
2030 నాటికి రాష్ట్రాన్ని లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య సేవల్లో డిజిటల్ విప్లవం, చౌకైన ఔషధాల అందుబాటు, పరిశోధనలకు ప్రోత్సాహం—ఈ మూడు అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















