దేశీయ ఎగుమతులకు ఊతమివ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇ-కామర్స్ ఎగుమతిదారుల కోసం కీలక చర్యలను ప్రకటించింది. రూ.25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌లో భాగంగా ఏడు కొత్త చర్యలను అమలు చేయనుంది. మొత్తం 10 అంశాలు ఉన్న ఈ మిషన్‌లో ఇప్పటికే మూడు కార్యక్రమాలను జనవరిలో అమలు చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
డిజిటల్ మార్గాల ద్వారా ఎగుమతులు చేసే వ్యాపారులకు రుణ సౌకర్యాలు, వడ్డీ రాయితీలు, పాక్షిక రుణ గ్యారెంటీలను అందించనుంది. ‘డైరెక్ట్ ఇ-కామర్స్ క్రెడిట్ సదుపాయం’ కింద 90 శాతం గ్యారెంటీతో రూ.50 లక్షల వరకు రుణం పొందవచ్చు. ‘ఓవర్‌సీస్ ఇన్వెంటరీ క్రెడిట్ ఫెసిలిటీ’లో 75 శాతం గ్యారెంటీ కవరేజీతో రూ.5 కోట్ల వరకు రుణ సహాయం అందుతుంది. దీనిపై 2.75 శాతం వడ్డీ రాయితీ లభించనుంది. అయితే ఒక్కో దరఖాస్తుదారుకు వార్షికంగా రూ.15 లక్షల వరకు మాత్రమే వడ్డీ రాయితీ పరిమితి ఉంటుంది.
ఎంఎస్‌ఎమ్‌ఈలకు కూడా 2.75 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఆర్‌బీఐ లేదా ఐఎఫ్‌ఎస్‌సీఏ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా జరిగే లావాదేవీలపై ఈ సదుపాయం అందుతుంది. ఒక్కో ఎంఎస్‌ఎమ్‌ఈకి రుణ పరిమితి రూ.50 లక్షలుగా నిర్ణయించారు. రుణ మంజూరు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో, పారదర్శకంగా అమలు చేస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టెస్టింగ్, సర్టిఫికేషన్, ఇతర వాణిజ్య నిబంధనలను పాటించేందుకు ‘అక్రిడిటేషన్ అండ్ కాంప్లియెన్స్ ఎనేబుల్‌మెంట్’ ద్వారా సహకారం అందించనున్నారు. అలాగే ‘ఫెసిలిటేటింగ్ లాజిస్టిక్స్, ఓవర్‌సీస్ వేర్‌హౌసింగ్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్’ ద్వారా విదేశాల్లో గిడ్డంగులు, ఇ-కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌లతో అనుసంధానం చేసే మౌలిక వసతులు కల్పించనున్నారు.ఈశాన్య, కొండ ప్రాంతాల ఎగుమతిదారులకు రవాణా ఖర్చులను తగ్గించేందుకు ‘లాజిస్టిక్స్ ఇంటర్‌వెన్షన్స్ ఫర్ ఫ్రైట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్’ కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. ఈ చర్యలతో దేశీయ ఎగుమతులు మరింత వేగం పుంజుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















