సూపర్–8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న Axar Patelను పక్కన పెట్టి Washington Sundarకు అవకాశం ఇచ్చారు. అయితే సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ 11 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో అక్షర్‌ను ఆడించి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నిర్ణయంపై టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ Ryan ten Doeschate స్పందించారు. జట్టు సమతౌల్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. “ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై మేం కొన్ని రోజులుగా చర్చించాం. జట్టులో వైవిధ్యం కోసం వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నాం. బ్యాటింగ్ డెప్త్ కోసం రింకు సింగ్‌ను కొనసాగించాం. అంతమాత్రాన అక్షర్ ప్రాధాన్యం తగ్గించినట్లుకాదు. అతడు జట్టుకు కీలక ఆటగాడు” అని చెప్పారు.
15 మంది ఆటగాళ్లలో 11 మందిని ఎంపిక చేయడం ఎప్పుడూ కష్టమేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆటగాళ్లు అర్థం చేసుకుంటారని, అక్షర్ కూడా అదే స్పూర్తితో తీసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే Sanju Samsonకు రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం లభించే అవకాశమున్నట్లు సంకేతాలిచ్చారు. “భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు. టాప్ ఆర్డర్‌లో కుడిచేతి వాటం బ్యాటర్‌గా వ్యూహాత్మకంగా ఆడగలడు. కీలక మ్యాచ్‌ల దృష్ట్యా ఈ అంశంపై రాబోయే రోజుల్లో చర్చ ఉంటుంది” అని ర్యాన్ టెన్ పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















