రీరాకృతి ఎలా ఉన్నా ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలని చెబుతోంది మృణాల్ ఠాకూర్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె గతంలో శరీర బరువు కారణంగా ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి భావోద్వేగంగా స్పందించారు.ఏడుస్తూ నిద్రపోయి… వాచిన కళ్లతో లేచిన రోజులు చాలానే ఉన్నాయి. నిరంతరం వచ్చే కామెంట్లు నన్ను నేను సందేహించుకునేలా చేసేవి. ఆ దశ నుంచి బయటపడటానికి చాలా ధైర్యం అవసరం అయింది’’ అని మృణాల్ చెప్పారు.
ఒక రోజు జిమ్‌లో ఓ యువతి ‘మీలాగా మారాలంటే ఏం చేయాలి?’ అని అడిగిన సందర్భం తన ఆలోచనలను మార్చిందని వెల్లడించారు. ‘‘మనల్ని మనం ప్రేమించుకుంటేనే ఇతరులు గౌరవిస్తారు’’ అన్న విషయాన్ని అప్పుడే గ్రహించానని తెలిపారు.
ఇదే సమయంలో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. ‘‘ట్రోల్స్‌ను పట్టించుకోకుండా మీలా మీరు ఉండండి. పాత్ర కోసం అవసరమైతేనే మారాలి’’ అన్న ఆయన మాటలు తనకు పెద్ద ప్రేరణగా మారాయని చెప్పారు.ఇటీవల ‘దో దివానే సెహర్ మే’లో కనిపించిన మృణాల్, త్వరలో అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















