సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన తాజా డ్రోన్ దాడి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చింది. అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పటికే ఉధృతంగా ఉండగా, ఈ ఘటనతో గల్ఫ్ దేశాల్లో భద్రతా పరిస్థితులు కట్టుదిట్టమయ్యాయి.
సౌదీ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం రెండు డ్రోన్‌లు ఎంబసీ భవనం వైపు దూసుకెళ్లాయి. వాటిలో ఒకటి భవన సమీపంలో పేలడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనానికి స్వల్ప నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. దాడి అనంతరం రియాద్‌లోని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఎంబసీ పరిసర ప్రాంతాలను పూర్తిగా సీజ్ చేసి, అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. డ్రోన్ దాడుల నేపథ్యంలో గగనతల భద్రతను కూడా మరింత బలోపేతం చేసినట్లు సమాచారం.
ఇప్పటికే కువైట్‌లోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుస దాడులతో అమెరికా లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార చర్యలు కొనసాగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ మృతి తర్వాత ప్రతీకార జ్వాలలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లకూడదని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ దాడులకు అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తంగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ఛాయల మధ్య నడుస్తోంది. దౌత్యపరమైన పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















