కొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తంజావూరు జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయ్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఈసారి తమిళనాడు ఎన్నికలు ఇతర పార్టీలకు సాధారణ రాజకీయ పోరాటం కావొచ్చేమో కానీ తనకు, తనను ప్రేమించే ప్రజలకు మాత్రం ఇది భావోద్వేగ పోరాటం అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో దిల్లీ టీమ్ (బీజేపీ)తో సహా అన్ని పార్టీలను టీవీకే ఓడిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.క్రికెట్‌తో పోల్చుతూ విజయ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్‌లలో తమిళనాడు ప్రజలు చెన్నై సూపర్ కింగ్స్‌కు విజిల్ వేస్తే, ఈ ఎన్నికల్లో మాత్రం టీవీకే ‘విజిల్’ గుర్తు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతుందని అన్నారు. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఎవరూ చెరపలేరని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు హామీలు కూడా ప్రకటించారు. రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల పిల్లల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అయితే ఆ కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదనే నిబంధన ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్య కోసం భారీ ఖర్చు చేయలేని పేద కుటుంబాలకు సహాయం చేయడమే తమ లక్ష్యమని వివరించారు.
అదే విధంగా మత్స్యకారుల కుటుంబాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ హామీ ఇచ్చారు.ఇదిలా ఉండగా, విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల ఆలస్యం కావడం గురించి కూడా సభలో ప్రస్తావించారు. ఈ చిత్రం ఈ ఏడాది పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా న్యాయపరమైన సమస్యల కారణంగా నిలిచిపోయిందని తెలిపారు. ఈ విషయంలో పలువురు తనకు మద్దతుగా మాట్లాడారని, అందులో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఉన్నారని చెప్పారు. అయితే మద్దతు వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదని విజయ్ వ్యాఖ్యానించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















