తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబ కలహాలు భయానక ఘటనకు దారితీశాయి. తనతో విడిపోయిన మహిళ సంతోషంగా జీవనం సాగిస్తుండటాన్ని తట్టుకోలేక భర్త కత్తితో దాడి చేసి హతమార్చిన దారుణం చోటుచేసుకుంది. అడ్డుకోవడానికి వచ్చిన ఆమె తల్లిని కూడా నిందితుడు కత్తితో పొడిచి చంపాడు.
జిల్లాలోని సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామానికి చెందిన సోడదాసి సీతారామరాజు (పండు) అదే గ్రామానికి చెందిన **లత (31)**ను పదహారేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఎనిమిది నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇద్దరూ విడిపోయారు. అనంతరం సీతారామరాజు మరో పెళ్లి చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా లత కొంతకాలం బంధువుల ఇంట్లో ఉండి ఇటీవల తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. ఇద్దరి ఇళ్లు ఒకే వీధిలో ఉండటంతో తరచూ ఎదురుపడేవారు. లత తన తల్లి, సోదరులతో కలిసి సంతోషంగా జీవనం సాగించడం నిందితుడికి అసహనంగా మారింది.
దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్న సీతారామరాజు వారం రోజుల పాటు రేకీ చేశాడు. చివరకు సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి లతను హతమార్చాడు. ఆమె కేకలు విని అడ్డుకునేందుకు వచ్చిన తల్లి గుమ్మడి లక్ష్మి (50)పై కూడా దాడి చేసి చంపాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు సీతారామరాజుతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఫైనాన్స్ వ్యాపారం చేసే నిందితుడు పాత నేరస్థుడని పోలీసులు తెలిపారు. అతనిపై ఇప్పటికే ఒక హత్య కేసు, పోక్సో కేసుతో పాటు పలు కొట్లాట కేసులు నమోదయ్యాయి. ఘటనాస్థలాన్ని ఇన్‌ఛార్జి డీఎస్పీ రామకృష్ణ, కోరుకొండ సీఐ ఎస్వీఎస్ఎస్ మూర్తి, ఎస్సై రామ్‌కుమార్ పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















