2024 సెప్టెంబరు 22 ఆదివారం రాత్రి 8.30 గంటలకు, ఆర్సెలార్ మిత్తల్ సీఈవో Aditya Mittalతో జరిగిన 30 నిమిషాల జూమ్ కాల్ రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని మంత్రి Nara Lokesh తెలిపారు. ఈ కాల్ కారణంగా దేశంలోనే అతి పెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌కు రావడం సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు.
లోకేశ్ మాట్లాడుతూ, “ఇది కేవలం స్టీల్ ప్రాజెక్ట్ కాదు. మన బలం, ధైర్యం, నమ్మకం. 2019 జనవరిలో దావోస్‌లో నేను ఆదిత్య మిత్తల్‌ను కలిసేందుకు ప్రయత్నించా. అప్పట్లో సమయం ఇవ్వలేదు. తరువాత టాటా గ్రూప్ నైట్‌క్యాంప్‌లో ఆయనను కలిసి, ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టరని అడిగాను. ఆయన మేము ఇప్పటికే మరో రాష్ట్రాన్ని చూస్తున్నామన్నారు. ఆ తర్వాత 2024లో ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఒక్కరోజు కూడా వృథా చేయకుండా ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాం. ఈ జూమ్ కాల్ రాష్ట్రానికి వరం నిలిచింది” అని తెలిపారు.
రికార్డు వేగంలో ప్రాజెక్ట్ అభివృద్ధి
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించి, రికార్డు సమయంలో ప్రాజెక్ట్ ప్రారంభించే సామర్థ్యం ఏపీలో ఉందని లోకేశ్ అన్నారు. సెప్టెంబరు 2024లో ఆదిత్య మిత్తల్‌తో మొదటి జూమ్ కాల్ తరువాత రెండు నెలల్లో ప్రాజెక్టుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించబడ్డాయి, మూడు నెలల్లో భూమి విడుదల చేయబడింది, 11 నెలల్లో పర్యావరణ, అటవీ అనుమతులు పొందారు. దేశంలో ఇంత భారీ ప్రాజెక్టుకు అత్యంత వేగంగా అనుమతులు లభించడం గర్వకారణం అని లోకేశ్ పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో హైగ్రేడ్ స్టీల్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ అనకాపల్లిని ప్రపంచపటంలో ప్రత్యేకంగా నిలబెడుతుందని, ఎన్‌ఎండీసీ సమన్వయం, స్లర్రీ పైపులైన్ అనుమతుల విషయంలో సీఎం ప్రత్యక్షంగా శ్రద్ధ తీసుకున్నారని ఆయన తెలిపారు. కేంద్ర, ప్రధానమంత్రి కార్యాలయంతో సమన్వయం చేసి అన్ని సవాళ్లను అధిగమించామని గుర్తుచేశారు.
ప్రజల ప్రేరణ
నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక మహిళతో మాట్లాడానని లోకేశ్ చెప్పారు. భర్త మద్యానికి బానిసై చనిపోయినా, ఆమె రెండు కుమారులను చదివించడంలో కృషి చేసి, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరింది. “యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చేసిన హామీకి ఆమె మాటలే ప్రేరణ” అని లోకేశ్ అన్నారు. భూమిపూజలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం చేయడం తన జీవితంలో భావోద్వేగ ఘట్టం అని, యువతకు ఇచ్చిన హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చినందుకు గర్వంగా అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















