గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఒక డ్రోన్ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో మంటలు భారీగా చెలరేగి, దట్టమైన పొగ ఆకాశంలో వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నాయి.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నష్టం కూడా పరిమితంగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఇరాన్ నుంచి వచ్చిన మరికొన్ని డ్రోన్‌లు, క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















