పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా, నిత్యావసర వస్తువుల లభ్యతపై ఎలాంటి అంతరాయం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి “టీమ్ ఇండియా”లా పనిచేస్తే ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధన భద్రత, వాణిజ్య స్థిరత్వం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్రాలు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.
వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఖరీఫ్ సీజన్‌కు ముందే ఎరువుల నిల్వలు, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. తప్పుడు సమాచారం, వదంతులు ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తాయని హెచ్చరించి, నిజమైన సమాచారం సమయానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్రమంగా నిల్వలు చేసి ధరలు పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలు మరియు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.పరిశ్రమలు, చిన్న మధ్యతరహా సంస్థలు (MSMEలు) ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించి ఉత్పత్తి, ఉపాధి నిరంతరంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇక భవిష్యత్తులో ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌరశక్తి, బయోఫ్యూయల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను విస్తరించాలని సూచించారు. కోవిడ్ సమయంలో కేంద్ర–రాష్ట్రాల సమన్వయం దేశానికి ఎంత ఉపయోగపడిందో గుర్తుచేసిన ప్రధాని, అదే స్పూర్తితో ఇప్పుడు కూడా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















