వైఎస్సార్ కడప జిల్లాలో విద్యార్థుల పోషకాహారానికి మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది. స్మార్ట్ కిచెన్ల నిర్వహణ కోసం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి రూ.50 లక్షల విరాళాన్ని అందజేసింది.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో యూసీఐఎల్ పరిశ్రమ జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, ముఖ్య పర్యవేక్షణాధికారి నవీన్‌కుమార్‌రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కు చెక్కును అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ కిచెన్ల ప్రాధాన్యతను అధికారులు వివరించారు.
ఇటీవల స్మార్ట్ కిచెన్ల నిర్వహణకు సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాలని కలెక్టర్ కోరగా, దానికి స్పందించిన యూసీఐఎల్ సంస్థ వెంటనే రూ.50 లక్షల సహాయాన్ని ప్రకటించడం విశేషం. ఈ నిధులతో పాఠశాలలలో ఆహార నాణ్యతను మెరుగుపరచడం, నిర్వహణను సక్రమంగా కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు మేనేజర్ ఎస్.ఎస్. గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ విరాళం ద్వారా జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















