సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో రూ.కోట్ల విలువైన నాలా భూమికి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో అసలు వ్యవసాయ భూమే లేకున్నా, భూ భారతి పోర్టల్‌లో హక్కుల మార్పిడి జరగడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుంగతుర్తికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బావమరిది అధికారులపై ఒత్తిడి తెచ్చి, చక్రం తిప్పడం వల్లే ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు సాధ్యమయ్యాయని తెలుస్తోంది.
కుంభకోణం నేపథ్యం: సూర్యాపేట మండల పరిధిలోని సర్వే నంబర్ 71/3లో ఉన్న 2.34 ఎకరాల భూమి గతంలోనే నాలా (NALA) కింద వ్యవసాయేతర భూమిగా మారింది. దీనికి సంబంధించిన కన్వర్షన్ ఫీజు చెల్లించి, లేఅవుట్ వేసి ప్లాట్లుగా విక్రయించారు. రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే, 2024లో అకస్మాత్తుగా పాత యజమాని మనవడి పేరుతో వారసత్వ బదిలీ (Virasat) కింద భూ భారతిలో హక్కులు మార్చేశారు. ఈ ఏడాది జనవరిలో అందులోని ఒక ఎకరాను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు.
అధికారుల నిర్లక్ష్యం – బాధితుల ఆవేదన: వాస్తవానికి భూ భారతి పోర్టల్ అక్రమాలకు తావులేకుండా ఉండాలని ప్రభుత్వం తీసుకొచ్చినా, క్షేత్రస్థాయి విచారణ చేయడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. వ్యవసాయ భూమి మచ్చుకైనా లేని చోట పట్టా పుస్తకాలు ఎలా జారీ చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై 2025 అక్టోబరులోనే బాధితులు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తదుపరి లావాదేవీలు జరగకుండా చూడాలని కోరినప్పటికీ, అధికారులు అవేమీ పట్టించుకోకుండా 2026 జనవరిలో భూమిని వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.
ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రూ.కోట్ల విలువైన భూమిని దొడ్డిదారిన అప్పగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు బుధవారం హైదరాబాద్‌లోని భూ పరిపాలన ప్రధాన కార్యాలయం (CCLA) లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పోర్టల్ నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ భూ దందా ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















