కేరళలోని త్రిస్సూర్ జిల్లా చువన్నమన్ను ప్రాంతంలో ఒక అరుదైన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా కాలువపై రోడ్డు నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం రోడ్డుపైనే కాలువ ప్రవహిస్తోంది. అది కూడా సాధారణ రోడ్డు కాదు, నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి నంబర్ 544పై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. సమీపంలోని పీచి డ్యామ్ నుండి వ్యవసాయ అవసరాల కోసం కాలువలో నీటిని విడుదల చేయడంతో ఈ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. హైవేపై ప్రవహిస్తున్న నీరు చూడటానికి స్థానికులు మాత్రమే కాకుండా పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.
కింద నుంచి వాహనాలు సాగే సమయంలో, పైన కాలువలో ప్రజలు స్నానం చేస్తూ, నీటిలో ఆడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక వైపు ఆకర్షణగా మారినప్పటికీ, భద్రతాపరమైన అంశాలపై అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. రోడ్డు మీద నీరు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















