పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పూర్వ మేదినీపుర్ జిల్లా హల్దియాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే ప్రజల కోసం 6 ముఖ్య గ్యారంటీలను అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. తృణమూల్ పాలనలో ప్రజల్లో భయం పెరిగిందని, దానిని తొలగించి విశ్వాసాన్ని నెలకొల్పుతామని చెప్పారు. పాలనలో పారదర్శకత తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులను జవాబుదారీగా మారుస్తామని, అవినీతి కేసులు, మహిళలపై దాడుల కేసులను తిరిగి తెరిచి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే అవినీతికి పాల్పడిన నేతలను వారి స్థాయి చూడకుండా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. చట్టబద్ధంగా ఉన్న శరణార్థులకు అన్ని ప్రభుత్వ సౌకర్యాలు అందిస్తామని, అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపిస్తామని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ అమలు చేస్తామని కూడా మోదీ ప్రకటించారు. బెంగాల్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే తృణమూల్ ప్రభుత్వాన్ని తప్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















