పేద కుటుంబంలో జన్మించి, చదువును ఆయుధంగా మలచుకుని రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన B. R. Ambedkar జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.ఆయన్ను అభిమానించే వారిలో కర్ణాటకకు చెందిన వరదన్ గురప్ప ప్రత్యేకంగా నిలుస్తున్నారు. సాధారణంగా అంబేడ్కర్ విగ్రహాలు కూడళ్లలో కనిపిస్తాయి. కానీ బీదర్ జిల్లా వాల్‌దొడ్డిలోని ఆయన ఇంటి పైకప్పుపైనే ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన గాఢమైన అభిమానాన్ని చాటుకున్నారు.
గురప్ప కర్ణాటక ప్రభుత్వ కార్యాలయంలో క్లర్కుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 2023 నవంబర్ 26న సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి అంబేడ్కర్ విగ్రహాన్ని తెప్పించి తన ఇంటిపై ప్రతిష్ఠించారు.నిత్యం ఉదయాన్నే అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తరువాతే తన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















