గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (Godrej Industries Group)లో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుంచి గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను పిరోజ్‌షా గోద్రేజ్ స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌గా ఉన్న నాదిర్ గోద్రేజ్ ఆగస్టులో 75 ఏళ్లు పూర్తయ్యాక పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి నుంచి ఆయన గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతారు. అలాగే గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ ఆగ్రోవెట్, గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ బోర్డుల నుంచి వైదొలగనున్నారు.
నాదిర్ గోద్రేజ్ ఇటీవలే ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ ఛైర్‌పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవుల నుంచి కూడా వైదొలిగారు. ఆయన స్థానంలో కొత్త నియామకాలు ప్రకటించబడ్డాయిపిరోజ్‌షా గోద్రేజ్, నాదిర్ గోద్రేజ్ సోదరుడైన ఆది గోద్రేజ్ కుమారుడు. ఆయన ఇప్పటికే గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ క్యాపిటల్, గోద్రేజ్ వెంచర్స్‌కు ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇకపై గ్రూప్ ప్రధాన బాధ్యతలను కూడా ఆయన స్వీకరించనున్నారు.
ఇదే సమయంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ ఛైర్‌పర్సన్‌గా నాదిర్ గోద్రేజ్ కుమారుడు బుర్జిస్ గోద్రేజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన గోద్రేజ్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.ఆస్టెక్ లైఫ్ సైన్సెస్‌లో విశాల్ శర్మను ఛైర్‌పర్సన్‌గా, అర్జిత్ ముఖర్జీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు.2024లో గోద్రేజ్ కుటుంబ వ్యాపారం రెండు గ్రూపులుగా విడిపోయిన తర్వాత, ఈ మార్పులు మరింత కీలకంగా మారాయి. కొత్త నాయకత్వంపై గ్రూప్ భవిష్యత్ వ్యూహాలపై ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















