ఆదాయపన్ను ఎగవేతకు ఇకపై అవకాశమే లేదని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని స్పష్టం చేశారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా పన్ను తప్పించుకోవడం సాధ్యం కాదని ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజియన్‌లో పన్ను వసూళ్లు సుమారు రూ.1.34 లక్షల కోట్లతో దేశంలో ఐదో స్థానంలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలుఆర్థిక సంస్థల నుంచి నిరంతర సమాచారం సేకరించి పన్ను చెల్లింపులను కచ్చితంగా నిర్ధారిస్తున్నట్లు చెప్పారు.
1991 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన సురేష్ బత్తిని గుంటూరు జిల్లాకు చెందినవారు. పన్ను వసూళ్లు, కార్పొరేట్ ట్యాక్స్, టీడీఎస్ అంతర్జాతీయ పన్నుల విధానం వంటి రంగాల్లో పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తాజాగా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించారు.
ఆదాయపన్ను చట్టాన్ని సులభతరం చేయడానికి 890 సెక్షన్లను 536కు తగ్గించారని ఆయన తెలిపారు. ఫేస్‌లెస్ ట్యాక్స్ విధానం ద్వారా అవినీతి అవకాశాలు తగ్గించి, పూర్తిగా డిజిటల్ విధానంలో పారదర్శకంగా పన్ను వ్యవస్థ నడుస్తోందని చెప్పారు.పన్ను విధానాల్లో మార్పులు శాస్త్రీయ అధ్యయనం తర్వాతే జరుగుతాయని, చివరికి ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















