కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణకు ముందు రోజు మంగళవారం సాయంత్రం అధికారులు ఈ చెల్లింపులు చేసినట్లు సమాచారం.ఒంటరి మహిళలు, పురుషులు సహా మొత్తం 79 మంది పిటిషనర్లు కోర్టును ఆశ్రయించగా, అందులో ఇప్పటివరకు 45 మందికి మాత్రమే పరిహారం అందింది. మిగిలిన 34 మంది పరిహారం పొందకుండానే మరణించడం గమనార్హం.
వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు 2019లో హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేకంగా రూ.12.54 లక్షల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. 2023లో న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, చెల్లింపుల్లో ఆలస్యం జరగడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి.విచారణ సమయంలో 6 వారాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆర్థిక శాఖ వద్ద ప్రక్రియ పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తించింది. దీంతో కోర్టు తిరిగి విచారణ చేపట్టింది.
తాజా విచారణలో ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు తెలిపినా, 2019 నుంచి వడ్డీ చెల్లింపులు, ఇంటి స్థలాల కేటాయింపు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















