ఇరాన్‌తో జరిగిన యుద్ధ ప్రారంభ దశల్లో భారీగా సైనిక నష్టాలను ఎదుర్కొన్న అమెరికా, ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ డ్రోన్లకు ప్రతిగా ‘మెరోప్స్ (MEROPS)’ అనే ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను భారీగా రంగంలోకి దించింది.ఈ విషయాన్ని అమెరికా సైనిక కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్ తాజాగా కాంగ్రెస్ ఎదుట వెల్లడించారు. ఇతర ఖరీదైన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే మెరోప్స్ తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
దాదాపు యుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే అమెరికా 13,000 మెరోప్స్ డ్రోన్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్కటి సుమారు 15,000 డాలర్లకు లభిస్తున్న ఈ డ్రోన్లు, పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఇంకా తక్కువ ధరకే వస్తాయని చెప్పారు. వీటి ద్వారా షాహెద్ డ్రోన్లను అడ్డుకోవడంలో ఖర్చు గణనీయంగా తగ్గిందని తెలిపారు.
ముందుగా అమెరికా పేట్రియాట్ వంటి ఖరీదైన క్షిపణులను ఉపయోగించాల్సి వచ్చేది. కానీ అవి అత్యంత ఖరీదైనవి కావడంతో ప్రత్యామ్నాయంగా కోయోట్, మెరోప్స్ వంటి వ్యవస్థలను వినియోగిస్తోంది. వీటిలో కూడా మెరోప్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం కలిగినదిగా నిలిచింది.
మెరోప్స్ అనేది కృత్రిమ మేధ ఆధారిత యాంటీ-డ్రోన్ వ్యవస్థ. ఇది చిన్న పరిమాణంలో ఉండి పికప్ ట్రక్కులపై కూడా అమర్చవచ్చు. శత్రు డ్రోన్లను ఢీకొట్టి లేదా పేలుడు పదార్థాలను ప్రయోగించి వాటిని కూల్చే సామర్థ్యం దీనికి ఉంది. గంటకు 175 మైళ్ల వేగంతో పనిచేసే ఈ వ్యవస్థ, శాటిలైట్ లేదా కమ్యూనికేషన్ లేకున్నా కూడా ఏఐ సహాయంతో లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయగలదు.‘మెరోప్స్’ అనే పేరు ఒక చిన్న పక్షి జాతి నుంచి తీసుకున్నారు. అదే పేరు ఆధారంగా ఈ ఆధునిక యాంటీ-డ్రోన్ సిస్టమ్‌కు పెట్టడం జరిగింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















