కర్ణాటకలో సంచలనం రేపిన హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి సహా మొత్తం 16 మందికి చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు శిక్ష విధించింది. అదనంగా ప్రతి ఒక్కరికీ రూ.1 లక్ష జరిమానా విధించింది.
ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన పోలీస్ అధికారి (సీఐ) చెన్నకేశవ టింగరికర్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సంతోష్ గజానన తీర్పు ఇచ్చారు.
2016 జూన్ 15న ధార్వాడలోని సప్తాపుర ప్రాంతంలో ఉన్న ‘ఉదయ్ జిమ్’లో జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేశ్ గౌడ హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి, 2020 నవంబర్ 5న వినయ్ కులకర్ణిని అరెస్టు చేసింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు.బెయిల్ షరతుల ప్రకారం ధార్వాడ జిల్లాలోకి ప్రవేశం నిషేధం ఉండటంతో, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన నియోజకవర్గానికి వెళ్లకుండానే భార్య, కుమార్తెల ప్రచారంతో విజయం సాధించారు.
నిందితుల నుంచి వసూలు చేసే జరిమానా మొత్తాన్ని బాధితుడు యోగేశ్ గౌడ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తీర్పు వెలువడిన వెంటనే వినయ్ కులకర్ణి ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించబడినట్లు విధానసభ కార్యదర్శి తెలిపారు. అయితే శిక్షపై స్టే వస్తే ఈ అనర్హత రద్దయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.వినయ్ కులకర్ణి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















