ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక విషాదంగా మారింది. ఛావనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన ఈ ఘటనలో కేటరింగ్ గుత్తేదారి దారుణ చర్య తీవ్ర కలకలం రేపింది.చమన్ అలియాస్ అమర్ (11) అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి పెళ్లికి హాజరయ్యాడు. అతడు పదే పదే లోపలికి వచ్చి రసగుల్లాలు తింటుండటంపై ఆగ్రహించిన కేటరింగ్ గుత్తేదారు మొదట అతనిపై అరవడంతో సరిపెట్టలేదు. మళ్లీ బాలుడు లోపలికి రావడంతో ఆగ్రహం అదుపుతప్పి, అతడిని ఎత్తుకొని మండుతున్న తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు.
దీంతో భయపడిన బాలుడు జారి నేరుగా పొయ్యిలో పడిపోయాడు. తీవ్రంగా కాలిన గాయాలతో కేకలు వేయగా, అక్కడున్నవారు వెంటనే స్పందించి బయటకు తీశారు. ముఖం నుంచి నడుము వరకు తీవ్ర గాయాలపాలైన బాలుణ్ని తక్షణమే లఖ్‌నవూ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని హరైయా సర్కిల్ అధికారి స్వర్ణిమా సింగ్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















