కంటికేమీ కనిపించకపోవచ్చు. పెద్దగా వాసనా తెలియకపోవచ్చు. అయినా కూడా ఇంట్లో, బయటా గాలి కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. కలుషిత గాలి ఇప్పుడు ప్రపంచ సమస్య. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ ఇది ప్రజారోగ్య సమస్యగా మారిందన్నా అతిశయోక్తి కాదు.
- కలుషిత గాలిని పీల్చటం కేవలం ఊపిరితిత్తుల మీదే ప్రభావం చూపుతుందని అనుకోవటం పొరపాటు. ఊపిరితిత్తులు నేరుగా రక్త ప్రసరణ వ్యవస్థతో ముడిపడి ఉండటం వల్ల కాలుష్య కారకాలు శరీరమంతా విస్తరిస్తాయి. ఒకసారి లోపలికి చేరుకోగానే కణస్థాయిలో వాపుప్రక్రియ(ఇన్‌ఫ్లమేషన్)ను ప్రేరేపితం చేస్తాయి. ఇది ఉబ్బసం (ఆస్థమా), గుండెజబ్బు, పక్షవాతం, మెదడు జబ్బుల వంటి రకరకాల సమస్యలకు బీజం వేస్తుంది.
- కాలుష్య కారకాలు అందరి మీదా ఒకేలా ప్రభావం చూపవు. ఉదాహరణకు- వాయు కాలుష్యంతో ఉబ్బసం తీవ్రమవుతుంది. వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నరోజుల్లో పిల్లల్లో ఆస్థమా ఉద్ధృతమవుతున్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. గుండెపోటు, పక్షవాతంతో పెద్దవాళ్లు ఆసుపత్రుల్లో చేరటమూ ఎక్కువగానే కనిపిస్తోంది. వాయు కాలుష్యం మధుమేహానికీ దారితీస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. కొన్ని కాలుష్య కారకాలు క్యాన్సర్లకూ కారణమవుతాయి.
- ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు గాలి కాలుష్యం తీరు మారిపోయింది. నిబంధనల మూలంగా కొన్ని హానికారక ఉద్గారాలు తగ్గాయి. పెట్రోలు నుంచి సీసాన్ని తొలగించటం వల్ల దీని మోతాదులు తగ్గాయి. స్వచ్ఛ విద్యుత్ కేంద్రాల మూలంగా సల్ఫర్ డయాక్సైడ్ తగ్గింది. కానీ ఇతర కాలుష్య కారకాలు ఎక్కువవుతూ వస్తున్నాయి.
- గాలి కాలుష్యంలో అతి ముఖ్యమైంది వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే నుసి పదార్థం (పీఎం 2.5). సూక్ష్మ రేణువుల రూపంలో ఉండే ఇది ఊపిరితిత్తుల లోపలికీ చేరుకోగలదు.
- మరో కాలుష్య కారకం ఓజోన్ వాయువు. కొన్నిరకాల కాలుష్య కారకాలు ఎండతో చర్య జరిపినప్పుడు ఇది వెలువడుతుంది. ఓజోన్ శ్వాస మార్గాలను చికాకు పరచటమే కాదు, వాటిని దెబ్బతీస్తుంది కూడా.
- కార్చిచ్చులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నుంచి వెలువడే నుసి, లోహాలు, రసాయనాలు వేలాది కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తాయి కూడా.
- బయటి కాలుష్యం గడప వద్దే ఆగిపోదు. ఇంట్లోకీ ప్రవేశించగలదు. దీంతో పాటు గ్యాస్ స్టవ్‌లు, సిగరెట్ల పొగ, దుమ్ము, పెంపుడు జంతువుల నూగు వంటివీ ఇంటి కాలుష్యానికి దారితీస్తాయి.
ఎవరి జాగ్రత్త వారిదే
గాలి కాలుష్యం బారినపడకుండా ఎవరికివారు జాగ్రత్త తీసుకోవటం మంచిది.
- వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. కిటికీలు మూసేసుకోవాలి. వాతావరణం శుభ్రంగా ఉన్నప్పుడు ఇంట్లోకి గాలి వచ్చి, పోయేలా చూసుకోవాలి.
- వంట చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్ చేయాలి.
- వీలైతే ఇంట్లో గాలిని శుభ్రం చేసే ఫిల్టర్లు అమర్చుకోవాలి.
- ఇంట్లో కట్టె, బొగ్గు పొయ్యిలు వెలిగించొద్దు. ఎవరినీ సిగరెట్లు కాల్చనీయొద్దు.
కొత్త ఆశ
ఊపిరితిత్తి కణాల చుట్టూ ఉండే హ్యాలురోనన్ పదార్థం దన్నుగా నిలుస్తుంది. వాయు కాలుష్యం దీన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇలా వదులైన పదార్థం ఊపిరితిత్తి కణాలను చికాకు పరుస్తుంది. దీంతో శ్వాస కష్టమవుతుంది. ఆరోగ్యకరమైన హ్యాలురోనన్‌ను ఇస్తే ఊపిరితిత్తులు తిరిగి కోలుకుంటున్నట్టు తేలటం విశేషం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















