దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్ 563 పాయింట్లు కోల్పోయి 78,709 వద్ద, నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,439 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 31 పైసలు తగ్గి రూ. 93.75 వద్ద ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణను ఏకపక్షంగా పొడిగించినా.. హర్మూజ్ దిగ్బంధనం కొనసాగించడంతో చమురు కష్టాలు ఇప్పట్లో గట్టెక్కని పరిస్థితి నెలకొంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ పర్యటన కూడా వాయిదా పడటం ప్రతికూల సంకేతాలను పంపింది.
అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. హాంకాంగ్ సూచీ 1.11 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీ 0.54 శాతం , జపాన్ నిక్కీ 0.83 శాతం పతనం అయ్యాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ముగించాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















