తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (55) మృతదేహం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన మృతదేహాన్ని తరలించగా, కుటుంబ సభ్యులు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
మరోవైపు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న వెల్లడించారు. శంకర్‌గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జేఏసీ ద్వితీయశ్రేణి నేతలు హాజరవుతారని తెలిపారు.
ఈరోజు ఉదయం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ముందుగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి, అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సంఘాల నేతలు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామాలు ఆర్టీసీ సమ్మెకు కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వంతో జరగనున్న చర్చలపై ఉద్యోగుల్లో, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















