తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఆనంద్ రెండేళ్లపాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు.
22 ఏళ్ల వయసులో, మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికైన ఆనంద్ 34 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో అనేక విభాగాల్లో సుదీర్ఘ సేవలు అందించారు. సీఐడీలో పని చేస్తున్న సమయంలో.. కృషి బ్యాంకు కేసులో ప్రధాన నిందితుడు, బ్యాంకాక్‌లో నక్కిన కొసరాజు వెంకటేశ్వరరావును భారత్‌కు రప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని.. సీఐడీ సాధించిన కీలక విజయాల్లో ఒకటిగా నిలిపారు.
ఆటలో మేటి..
స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడైన ఆనంద్ చదువుకునే రోజుల్లోనే అండర్-22కు ఎంపికయ్యారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడుతూ ఐదు సెంచరీలు సాధించారు. 2019లో అఖిల భారత టెన్నిస్ టోర్నీలో ప్రథమ స్థానం సాధించారు. పలు గోల్ఫ్ టోర్నమెంట్లలోనూ పాల్గొన్నారు. 2002లో రాష్ట్రపతి శౌర్యపతకం (పీఎంజీ), 2007లో భారత పోలీసు పతకం (ఐపీఎం), 2017లో రాష్ట్రపతి పతకంతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు.
యూపీఎస్సీ ద్వారా మూడో డీజీపీ
పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ కేసులో డీజీపీ ఎంపికపై తాము జారీ చేసిన మార్గదర్శకాలను చాలా రాష్ట్రాలు పట్టించుకోవడంలేదని సుప్రీంకోర్టు తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగానే అర్హులైన అధికారులతో కూడిన జాబితాను పలుమార్లు యూపీఎస్సీకి పంపింది. కానీ అందులో తప్పులు దొర్లాయని యూపీఎస్సీ తిప్పి పంపింది. వీటన్నింటినీ సరిదిద్ది చివరగా గత ఫిబ్రవరిలో పంపిన జాబితా నుంచి సీవీ ఆనంద్, వినయ్‌ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రాల పేర్లను ఎంపిక చేసిన యూపీఎస్సీ ఈ వివరాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ ముగ్గురి నుంచి సర్కారు ఇప్పుడు సీవీ ఆనంద్‌ను డీజీపీగా ఎంపిక చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















