తనకు ప్రియుడే కావాలంటూ ఓ వివాహిత సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ (30) అనే మహిళకు బర్మనే గ్రామానికి చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె తన అత్తింటి నుంచి బయటకు వచ్చి.. దగ్గర్లో ఉన్న సెల్ టవర్ ఎక్కింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను కిందకు దించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. దాదాపు మూడు గంటల పాటు మండుటెండలో ఆమె సెల్ టవర్ పైనే ఉండిపోయింది. చివరికి అధికారులు నచ్చజెప్పడంతో ఆమె కిందకు దిగొచ్చింది. అనంతరం తనకు ఇష్టం లేకుండానే వివాహం జరిగిందని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తిని తాను ప్రేమిస్తున్నట్లు, అతడితోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















