ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం నగరంలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆముదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
మొక్కజొన్న పంటలు నీటిలో తడిచి ముద్దగా మారడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం ఎంతవరకు జరిగిందో అధికారులు అంచనా వేస్తున్నారు.మొత్తం మీద ఈ అకాల వర్షాలు రైతులు మరియు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















