సుబ్బయ్య ఇంట్లో మంగయ్య పని చేస్తున్నాడు. అతనికి కాస్త మతిమరుపు.. దాంతో అప్పుడప్పుడు కొన్ని పనులు మర్చిపోయేవాడు. సుబ్బయ్యేమో పిసినారి. పనిచేసే వారికి కూలి ఇవ్వడానికి కూడా ఇష్టపడడు. ఒకరోజు మంగయ్యను పిలిచి.. ‘మన కుక్క కనిపించట్లేదు. నువ్వే బయటికి తీసుకెళ్లావు కదా!’ అన్నాడు. దాంతో.. ‘కుక్కని ఎక్కడో వదిలేసి వచ్చినట్లున్నాను’ అని బాధపడ్డాడు మంగయ్య. దాన్ని ఆసరా చేసుకుని ఆ నెల జీతంలో కోత పెట్టాడు సుబ్బయ్య. మరుసటి నెలలో.. ‘ఆవు కనిపించట్లేదు’ అన్నాడు. మంగయ్య ఏమీ మాట్లాడలేదు. అప్పుడు కూడా తక్కువ జీతమే ఇచ్చాడు. ఆ తరవాత గుర్రం కనిపించట్లేదని, మరో నెలలో కోడి కనిపించట్లేదని.. ఇలా ప్రతి నెలా ఏదో ఒక వంకతో మంగయ్యకు జీతం తగ్గించసాగాడు సుబ్బయ్య. దాంతో దిగులు పడిన మంగయ్య తనకు తెలిసిన ఒక మాస్టారు దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. అదంతా విన్న మాస్టారు.. ‘మతిమరుపు నీకు ఉందేమో కానీ, కనిపించకుండాపోయిన ఆ జంతువులకు లేదు కదా!’ అన్నాడు మాస్టారు. ‘అవునండీ!’ జవాబిచ్చాడు మంగయ్య. ‘సాధారణంగా ఏ పెంపుడు జంతువైనా ఎంత తిరిగినా చివరికి అది రోజూ ఉండే చోటుకు చేరుకుంటుంది. ఎవరైనా ఎత్తుకుపోతే మాత్రం చెప్పలేం’ అన్నాడు మాస్టారు. దాంతో మంగయ్య ఆలోచనలో పడ్డాడు. వెంటనే యజమాని దగ్గరికి వెళ్లి.. ‘అయ్యా! ఎవరో కావాలనే మన కుక్క, ఆవు, గుర్రం, కోళ్లను దొంగిలించారు. మనం వెంటనే రచ్చబండ దగ్గర ఫిర్యాదు చేద్దాం’ అంటూ తొందరపెట్టాడు. అప్పుడు సుబ్బయ్యకు ఏం చేయాలో అర్థంకాలేదు. రచ్చబండ దగ్గరికి వెళ్తే తన పరువే పోతుందని.. ‘నన్ను క్షమించు మంగయ్యా, నీకు జీతం ఎక్కువ ఇవ్వడం ఇష్టం లేక నేనే మన పెంపుడు జంతువులను మా తమ్ముడి ఇంట్లో పెట్టాను’ అని చెప్పాడు. అలాగే ఇన్నిరోజులు తనకు ఇవ్వని జీతాన్ని కూడా ఇచ్చేశాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















