హారతి ఇవ్వడం అంటే కాంతి ద్వారా భగవంతుడిని ధ్యానించడం. హారతి ఇస్తున్నప్పుడు వచ్చే వెలుగు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనసులోని చెడు ఆలోచనల్ని తొలగించి, ఆధ్యాత్మిక భావననూ, సానుకూల దృక్పథాన్నీ పెంచుతుంది. సాధారణంగా హారతిని కర్పూరం లేదా నెయ్యి దీపంతో ఇచ్చినా రెండింట్లో కర్పూర హారతే శ్రేష్టం. పూర్తిగా కరిగిపోయే కర్పూరం అహంకార నిర్మూలనకూ, కోరికలపైన నియంత్రణకూ సంకేతమంటారు. ఏమీ ఆశించకుండా భగవంతుడిని ధ్యానించడమే హారతి ప్రధాన ఉద్దేశం. ఇంకా, కర్పూరాన్ని వెలిగిస్తే కీటకాలు కూడా నశిస్తాయి. ఇల్లంతా పరిమళభరితమూ అవుతుంది.
అసలు హారతిని ఎలా ఇవ్వాలి?
హారతి పళ్లాన్ని రెండు చేతులతో పట్టుకుని సవ్యదశలో ఇవ్వాలి. దేవుడి పాదాల దగ్గర నాలుగుసార్లు, నాభి వద్ద రెండుసార్లు, ముఖం దగ్గర ఒకసారి లేదా రెండుసార్లు హారతిని తిప్పాలి. చివరగా దేవుడి విగ్రహం లేదా ఫొటో చుట్టూ రెండుమూడుసార్లు తిప్పి ఆ జ్యోతి దగ్గర నీటిని అర్పించి.. అప్పుడు హారతిని కళ్లకు అద్దుకోవాలి.
హారతిని ఎన్ని రకాలుగా ఇవ్వొచ్చు?
ఒకటిరెండు కర్పూరపు బిళ్లల్ని వెలిగించి, దేవుడి రూపం చుట్టూ తిప్పితే హారతి అయిపోతుందనుకుంటారు కానీ… ఇందులో 108 రకాలు ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నిత్యపూజలో ఏకహారతి, పంచహారతి ఎక్కువగా ఇస్తారు. ఏకహారతి అంటే ఒక దీపంతో చేసేది. పంచభూతాలకు ప్రతీకగా అయిదు దీపాలతో పంచహారతిని ఇస్తారు. ఇవి కాకుండా… నేత్ర హారతి, రుద్రహారతి, కలశం రూపంలో ఇచ్చే కుంభహారతి, సుదర్శన హారతి, నృత్యహారతి అంటూ ఎన్నో రకాలు ఉన్నాయి.
హారతి ఇస్తున్నప్పుడు కిందపడితే ఏమైనా అపశకునమా?
హారతి సమయంలో ఆ పళ్లెం చేజారినా కర్పూరం కిందపడినా లేదా ఆరిపోయినా అపశకునం అనుకోనక్కర్లేదు. గాలి ఎక్కువగా ఉండటం లేదా అజాగ్రత్తకు సంకేతం అంతే. ఆ వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకుని దేవుడికి నమస్కరించి, మరోసారి హారతి ఇస్తే సరిపోతుంది. అన్నింటికన్నా దేవుడిపైన నమ్మకంతో ఉండటమే ముఖ్యం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















