ఆలయం అంటే ఎత్తయిన ప్రాకారాల మధ్య కనిపించే గర్భగుడిలో కొలువైన భగవంతుని విగ్రహాన్ని ఊహించుకుంటాం. కానీ, తమిళనాడు పుదుకోట్టయ్ జిల్లా, చెట్టినాడు ప్రాంతంలోని తిరుప్పెరుందురై గ్రామంలో ఉండే అవదుయార్ శివాలయం ఆశ్చర్యపరిచే నిర్మాణశైలితో ఆకట్టుకున్నా… గర్భాలయంలో శివలింగం కనిపించదు. నంది, పార్వతీదేవి విగ్రహాలు, ధ్వజస్తంభం లాంటివేవీ ఉండవు. అయినా కూడా పది ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు ఆత్మానంద స్వామిగా, పార్వతీదేవి యోగాంబాళ్‌గా పూజలు అందుకోవడం విశేషం. మణివాచకర్ అనే శివభక్తుడు పాండ్యరాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసేవాడు. ఓసారి పాండ్యరాజు కోసం మేలురకం గుర్రాలను తీసుకొచ్చేందుకు బయలుదేరిన మణివాచకర్ ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి బాధపడి రాజు ఇచ్చిన ధనాన్ని దాని పునర్నిర్మాణం కోసం ఉపయోగించాడు.
అది తెలిసి రాజు శిక్షిస్తే పరమేశ్వరుడు కాపాడాడట. ఆ తర్వాత మణివాచకర్ తన పదవిని వదిలేసి, శివుడిని కీర్తిస్తూ శేష జీవితాన్ని ఇక్కడే గడిపాడనీ, స్వామికోసం తిరువాచకం పేరుతో శ్లోకాలు రచించాడనీ స్థలపురాణం పేర్కొంటోంది.
ఇక, గర్భగుడిలో ఎలాంటి విగ్రహం లేకపోయినా అర్చకులు నిత్యపూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ మణివాచకర్ రాసిన తిరువాచకంలోని పద్యాల్ని చదువుతారు.
అదే నివేదన…
రోడ్డుమీద నుంచే నేరుగా గర్భాలయాన్నీ, అందులోని దీపాలనూ చూసే విధంగా నిర్మించిన ఈ ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద రెండు రాతి స్తంభాలూ, ఒక్కోదానిపైన 500 చొప్పున చెక్కిన చిన్న స్తంభాలూ ఆకట్టుకుంటాయి. ఇంకా హిరణ్యకశిపుని సంహరించే ఉగ్ర నరసింహుడి రూపం, శివతాండవం, వేలాయుధం కాకుండా ధనుస్సు పట్టుకున్న సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు, మండపాల స్తంభాలపైన చెక్కిన నవగ్రహాలూ, 21 నక్షత్రాల శిల్పాలూ తదితరాలనూ చూడొచ్చు. గర్భగుడిలో విగ్రహం లేకపోయినా రాతి వేదికపైనే ఆకుకూరలూ, కాకరకాయ కలిపి వండిన అన్నాన్ని వేడివేడిగా పరుస్తారు. దీన్నుంచి వచ్చే ఆవిరినే రూపంలేని శివునిరూపంగా భావిస్తారు భక్తులు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















