దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని నాలుగంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిస్థితి విషమించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా రెండు కుటుంబాలకు చెందిన మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సుమారు 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
భవనంలో అత్యవసర ద్వారం లేకపోవడం, టెర్రస్‌పైకి వెళ్లే మార్గం మూసివేయబడటం వల్ల బాధితులకు బయటపడే అవకాశం లేకపోయిందని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews



















