ఇటీవలి కాలంలో విటమిన్ D లోపం చాలా సాధారణ సమస్యగా మారుతోంది. సూర్యరశ్మికి వెళ్లినా కూడా కొందరిలో ఈ లోపం కనిపించడం గమనార్హం. దీనికి కారణాలు కేవలం ఎండలో తక్కువగా ఉండటం మాత్రమే కాకుండా, చర్మం రంగు, వయస్సు, శరీరంలో పోషకాలు గ్రహించే సామర్థ్యం, జీవనశైలి వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువ మంది ఎక్కువ సమయం ఇంట్లో లేదా ఆఫీసుల్లో గడుపుతున్నారు. దీంతో సహజ సూర్యరశ్మి తక్కువగా తాకుతుంది. అంతేకాకుండా సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా విటమిన్ D లోపానికి కారణమవుతోంది. సూర్యరశ్మి విటమిన్ Dకు ప్రధాన మూలం అయినప్పటికీ, అది మాత్రమే సరిపోదని నిపుణులు చెబుతున్నారు.
సన్‌స్క్రీన్ వల్ల విటమిన్ D తగ్గుతుందా?
సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడితే కిరణాలు చర్మానికి తక్కువగా చేరుతాయి. ఈ కిరణాలే శరీరంలో విటమిన్ D తయారికి అవసరం. అందువల్ల కొంత మేరకు విటమిన్ D ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే సన్‌స్క్రీన్ పూర్తిగా విటమిన్ D ఉత్పత్తిని ఆపేస్తుందని చెప్పడం సరికాదు.
విటమిన్ D లోపానికి కేవలం సన్‌స్క్రీన్ మాత్రమే కారణం కాదు. కాలుష్యం, తక్కువ సూర్యకాంతి, ఆహార లోపం, శారీరక చురుకుదనం లేకపోవడం కూడా ముఖ్య కారణాలు.
విటమిన్ D కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ప్రతిరోజూ కొంతసేపు ఉదయం లేదా సాయంత్రం సూర్యరశ్మిలో గడపడం
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
- పాలు, పెరుగు, గుడ్లు, చేపలు వంటి విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం
- అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడటం
మొత్తంగా విటమిన్ D లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారం, కొంత సూర్యరశ్మి మరియు వైద్య సలహాతో ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















