అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు వీరికి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
గత నెల 28 నుంచి కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారి ఉత్సవమూర్తుల పల్లకీని భుజాన మోసి రథం వరకు తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వేదమంత్రాల నడుమ మడుగుతేరు కార్యక్రమం నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు “నమో నారసింహ” అంటూ గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు. ఉద్భవలక్ష్మి ఆలయం నుంచి కొండ చుట్టూ సాగిన ఈ రథయాత్ర సుమారు 40 నిమిషాల పాటు కొనసాగి తిరిగి యథాస్థానానికి చేరుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టగా వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ముగిశాయి.
భారీ సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో పెన్నహోబిళ క్షేత్రం కిక్కిరిసిపోయింది. భద్రత కోసం పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవం అనంతరం భక్తులు ఒకేసారి తిరుగు ప్రయాణం కావడంతో అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రత్యేక చర్యలతో వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. అగ్నిమాపక శాఖ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















