కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సమావేశంలో ఓ ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. కొల్లాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బిందు కృష్ణను సొంత పార్టీ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ బలవంతంగా కౌగిలించుకునే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా పలకరించగా, ఆయన అనుచితంగా ప్రవర్తించడంతో ఆమె అసౌకర్యానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులకే భద్రత లేకపోతే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఘటనపై పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

















