All India Anna Dravida Munnetra Kazhagam లో రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు C. V. Shanmugam నేతృత్వంలో కొందరు నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి Vijay కు మద్దతు ప్రకటించారు.
కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షణ్ముగం వెల్లడించారు. డీఎంకేకు వ్యతిరేకంగా ఏర్పడిన అన్నాడీఎంకే, అదే పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పార్టీ సభ్యుల మెజారిటీ తిరస్కరించిందన్నారు. డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు కుదిరితే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.ప్రస్తుతం తమ దృష్టి అన్నాడీఎంకేను పునరుద్ధరించి బలోపేతం చేయడంపైనే ఉందని, అందుకే ఎన్నికల్లో విజయం సాధించిన Tamilaga Vettri Kazhagam కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇది పార్టీ చీలిక కాదని, పార్టీ భవిష్యత్తుపై సరైన నిర్ణయం కోసం జనరల్ సెక్రటరీ Edappadi K. Palaniswami చర్యల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. అలాగే Bharatiya Janata Party తో సంబంధాలు తెంచుకోవాలని తిరుగుబాటు వర్గం తీర్మానం చేసింది.ఇక తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా JCD Prabhakar ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ టీవీకే తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేయగా, ఇతర పార్టీలకు మెజారిటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















