అన్నమయ్య జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో బాలికలు ప్రేమ పేరుతో మోసపోవడం, గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరగడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
మదనపల్లె మండలానికి చెందిన ఓ బాలిక పట్టణానికి వచ్చి వెళ్లే సమయంలో యువకుడి మోసానికి గురై గర్భిణి అయింది. అనంతరం మగబిడ్డకు జన్మనిచ్చింది. మరో ఘటనలో పదో తరగతి పూర్తి చేసిన బాలిక ఇంటివద్దే ఉండగా అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భిణిని చేశాడు. ఆమె ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చింది.వాల్మీకిపురం గురుకుల పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని కూడా బిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపింది. సమీప బంధువే ఆమెను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసులు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల్లో బాల్యవివాహాలు అధికమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపం, ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు లేని అనాథ బాలికలు కూడా ఈ పరిస్థితులకు బలవుతున్నట్లు వెల్లడైంది.ఆసుపత్రుల్లో ప్రసవాలకు వచ్చే వారిలో టీనేజ్ బాలికల సంఖ్య అధికంగా ఉండటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. 18 ఏళ్లలోపే ఇద్దరు పిల్లలకు తల్లులవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. రక్తహీనత, హైరిస్క్ గర్భధారణలు, మాతాశిశు మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంటోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై 100, 112, 1098 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి బాల్యవివాహాలను అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















