అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయం భారీగా పెరగడంతో ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రారంభంలో రూ.50 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.103 కోట్లకు పెరిగిందన్నారు. క్యాబినెట్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా పోస్టల్ శాఖలో చేపట్టిన సంస్కరణల గురించి ఆయన మీడియాకు వివరించారు. 2024-25లో రూ.13,200 కోట్లుగా ఉన్న పోస్టల్ శాఖ ఆదాయం, 2025-26లో రూ.15,300 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే రూ.2,100 కోట్ల అదనపు ఆదాయం సాధించినట్లు వెల్లడించారు.2026-27 నాటికి రూ.20 వేల కోట్ల ఆదాయం సాధించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ తపాలా సేవలతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షిప్‌రాకెట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో కలిసి పార్సిల్ సేవలను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.
పోస్టాఫీస్‌కు వెళ్లకుండానే పోస్టల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందేలా కొత్త వ్యవస్థ తీసుకువస్తున్నామని తెలిపారు. మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో యూపీఐ ఆధారిత లావాదేవీలు కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పోస్టల్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















