రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేయడం, బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను రోజుల తరబడి వదిలేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్త టోయింగ్ పాలసీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా విధానాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ పాలసీలో అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకునే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇకపై నోపార్కింగ్ జోన్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌కు అడ్డంగా నిలిపిన వాహనాలను అధికారులు టోయింగ్ చేసి పార్కింగ్ యార్డులకు తరలించనున్నారు.
కొత్త విధానంలో టోయింగ్ ఛార్జీలు, రోజువారీ పార్కింగ్ ఫీజులు వాహనదారులే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న చలాన్లు, రోడ్ ట్యాక్స్, ఫిట్‌నెస్, బీమా, ఇతర పెండింగ్ జరిమానాలు కూడా తప్పనిసరిగా క్లియర్ చేయాల్సి ఉంటుంది.
30 నుంచి 45 రోజుల్లో వాహనాన్ని క్లెయిమ్ చేయకపోతే వేలానికి పంపే అవకాశం కూడా ఉంది. ద్విచక్ర వాహనాలకు రోజుకు రూ.20-30, ఆటోలకు రూ.35-50, కార్లకు రూ.60-80, బస్సులకు రూ.200-300 వరకు పార్కింగ్ ఛార్జీలు ప్రతిపాదించారు.ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వాహనాలను నిల్వ చేసేందుకు తగిన స్థలాలు లేకపోవడంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. కొత్త పాలసీ అమల్లోకి వస్తే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















