ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. తాజా మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అజేయ శతకం (105*) కావడం విశేషం. అతని ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇది అతనికి 9వ సెంచరీ కావడం గమనార్హం.
మ్యాచ్ అనంతరం కోహ్లీ తన ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ, శతకం కంటే జట్టు విజయమే తనకు ముఖ్యమని స్పష్టం చేశాడు. “సెంచరీ తర్వాత పెద్దగా సంబరాలు చేయలేదు. ఈ రెండు పాయింట్లు ఎంత కీలకమో మాకు తెలుసు. జట్టు విజయంలో భాగమవడం ఎప్పుడూ సంతోషమే” అని అన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో రన్స్ రాకపోవడం తనను లోలోపల ప్రభావితం చేసిందని కూడా పేర్కొన్నాడు.
“నేను నా ఆటపై నమ్మకం ఉంచాను. కొత్తగా ఏదీ ప్రయత్నించలేదు. పరిస్థితికి తగ్గట్టు ఆడాను. ఒత్తిడి ఉన్నప్పుడే మనలోని బెస్ట్ బయటకు వస్తుంది. నెట్ ప్రాక్టీస్‌లో కూడా నేను కష్టపడి సాధన చేస్తాను. గత వైఫల్యాలు మనల్ని మరింత బలంగా మారుస్తాయి” అని కోహ్లీ వివరించాడు.
ఖాళీల్లోకి బంతిని పంపడంపై దృష్టి పెట్టానని, అవసరమైనప్పుడు సిక్సర్లు, సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లానని తెలిపాడు. మ్యాచ్‌లో వెనుకబడకుండా ఉండేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నానని చెప్పాడు.
“రికార్డులు బ్రేక్ చేయడం కంటే నాకు క్రికెట్ ఆడటమే ఇష్టం. ఈ స్థాయిలో ఆడటం గౌరవంగా భావిస్తున్నాను. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. దేవుడి దయ వల్ల మంచి ఇన్నింగ్స్ ఆడగలిగాను. దానికి ఎప్పుడూ కృతజ్ఞుడిని” అని విరాట్ కోహ్లీ భావోద్వేగంగా వ్యాఖ్యానించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















