N. Chandrababu Naidu శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కీలక ప్రకటనలు చేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే తన లక్ష్యమని పేర్కొన్న సీఎం.. పిల్లలను భారంగా కాకుండా సంపదగా చూడాలని పిలుపునిచ్చారు.
మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేల ప్రోత్సాహకం, నాలుగో బిడ్డకు రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. “తల్లికి వందనం” పథకం కింద ఇప్పటికే రూ.15 వేలు ఇస్తున్నామని, భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింత పెంచే ఆలోచన ఉందన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్”ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్లీన్ డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నుంచి సంపద సృష్టి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు.గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. విశాఖకు గూగుల్‌ను తీసుకొచ్చామని, ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాకుండా పరిశ్రమల కోసం ప్రజలు అక్కడికే రావాల్సిన పరిస్థితి తీసుకువస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















